మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మరోసా రి ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. దీనికి సంబంధించి జిఓ ఆర్‌టి నెంబర్ 1806 రాష్ట్ర ప్రభుత్వ ప్ర ధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్ డైరెక్టర్‌గా ఉన్న జి.సృజ న, ఐఏఎస్‌ను జిహెచ్‌ఎంసి కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్భుల్లాపూర్ జోనల్) అడిషనల్ కమిషనర్‌గా నియమించారు. ఉమెన్ అండ్ చైల్డ్‌వెల్ఫేర్ డైరెక్టర్‌గా ఉన్న శృతి ఓజాకు పంచాయ తీరాజ్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు. నిజామాబాద్ కలెక్టర్‌గా పనిచేస్తున్న టి. వినయ్‌కృష్ణారెడ్డిని (జిహెచ్‌ఎంసి మల్కాజిగిరి, ఎల్‌బినగర్, ఉప్పల్ జోనల్) అడిషనల్ కమిషనర్‌గా నియమించారు. నల్లగొండ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఇలా త్రిపాఠీని, నిజామాబాద్‌కు బదిలీ చేశారు. సంగారెడ్డి లోకల్ బాడీస్ అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న చంద్రశేఖర్ బడుగును నల్లగొండ కలెక్టర్‌గా బదిలీ చేశా రు. తాండూరు, వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఉమాశంకర్ ప్రసాద్‌కు నారాయణపేట లోకల్ బాడీస్ (అడిషనల్ కలెక్టర్‌గా) అదనపు బాధ్యతలు అప్పగించారు.