తిరువనంతపురం: శ్రీలంక మహిళలతో మంగళవారం జరిగిన ఐదో, చివరి టి20లో ఆతిథ్యభారత జట్టు 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 5-0తో క్లీన్‌స్వీప్ చేసింది. చివరి టి20లో ముందుగా బ్యాటింగ్ చేసినభారత్ 20 ఓవర్లలో ఏడువికెట్ల నష్టానికి 175 పరుగులు సాధించింది. తర్వాత లక్షఛేదనకు దిగిన శ్రీలంక మహిళా టీమ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 160 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఓపెనర్ హసిని పెరెరా, ఇమేశా దులానీలు మాత్రమే భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు.
కీలక ఇన్నింగ్స్ ఆడిన హసిని 42 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో 65 పరుగులు చేసింది. దులాని 39 బంతుల్లో 8 బౌండరీలతో 50 పరుగులు సాధించింది. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాను కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆదుకుంది. లంకు బౌలర్లపైఎదురుదాడికి దిగిన హర్మన్ 43 బంతుల్లోనే 9 ఫోర్లు, ఒక సిక్స్‌తో 68 పరుగులు చేసింది. చివర్లో అమన్‌జోత్ కౌర్ (21), అరుధంతి రెడ్డి 27 (నాటౌట్) మెరుపులు మెరిపించారు. దీంతో భారత్ స్కోరు 175 పరుగులకు చేరింది.