నగరంలోని యాప్రాల్‌కు చెందిన భవ్య నమాని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌జిఎఫ్‌ఐ) అసోసి యేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఎఐయు) గుర్తింపు పొందిన 6వ ఆల్ ఇండియా కరాటే చాంపియన్‌షిప్ (నేషనల్స్)లో పాల్గొన్నారు. అలాగే భారత్, జపాన్, నేపాల్, బంగ్లాదేశ్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్ దేశాల నుంచి క్రీడాకారులు పాల్గొన్న ఎస్‌కెజెఎస్ 13వ అంతర్జాతీయ కరాటే చాంపియన్‌షిప్‌లో కూడా ఆమె పోటీపడ్డారు. ఈ రెండు పోటీలలో కలిపి మొత్తం నాలుగు మ్యాచ్‌లు ఆడి, ఫిమేల్ అడల్ట్65 కిలోల కుమిటే విభాగంలో విజయం సాధించి బంగారు పతకాలు గెలుచుకున్నారు. తన విజయానికి నిరంతర మార్గదర్శకత్వం, క్రమశిక్షణ, శిక్షణ అందించిన తన కోచ్ గ్రాండ్‌మాస్టర్ ఎస్. శ్రీనివాసన్, ఒకినావా మార్షల్ ఆర్ట్ అకాడమీకి ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.