న్యూఢిల్లీ : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని , బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ అధినేత్రి ఖలీదా జియా అంత్యక్రియలు డిసెంబర్ 31 న జరగనున్నాయి. ఢాకా లోని జియా ఉద్యాన్‌లో తన భర్త జియావుర్ రెహమాన్ సమాధి పక్కనే ఖలీదాను ఖననం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరు కానున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.