న్యూఢిల్లీ : రైల్‌వన్ యాప్‌లో టికెట్ల కొనుగోలుపై రైల్వేశాఖ ఆఫర్ ప్రకటించింది. ఈ యాప్ ద్వారా అన్‌రిజర్వుడు టికెట్లను ఏ డిజిటల్ పేమెంట్ మోడల్‌లో కొనుగోలు చేసినా, 3 శాతం డిస్కౌంట్ అందించనున్నట్టు తెలిపింది. 2026 జనవరి 14 నుంచి జులై 14 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది.
ప్రస్తుతం రైల్‌వన్ యాప్‌లో ఆర్‌వాలెట్ ద్వారా చెల్లింపులు చేసిన వారికి ఈ క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. దీన్ని అన్ని డిజిటల్ పేమెంట్లకూ విస్తరించారు. ఈ ఆఫర్‌కు అనుగుణంగా సాఫ్ట్‌వేర్ వ్యవస్థలో మార్పులు చేయాలని సెంటర్‌ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కు రైల్వేశాఖ సూచించింది.ఈ నిర్ణయంపై మే నెలలో ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తారు. ఆర్‌వాలెట్ ద్వారా కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్ యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది.