తిరువనంతపురం: గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న ఐదో టీ20 మ్యాచ్ లో భారత్ మహిళల జట్టు, శ్రీలంకకు 176 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బారత్ కు శుభారంభం దక్కలేదు.ఓపెనర్ షఫాలీ వర్మ(5)తో పాటు తొలి మ్యాచ్ ఆడుతున్న మరో ఓపెనర్ కమలినీ(12)లు విఫలమయ్యారు. ఆ తర్వాత హిట్టర్ రిచా ఘోష్ (5), దీప్తి శర్మ(7)లు కూడా నిరాశపర్చారు. దీంతో భారత్ కష్టాల్లో పడింది. ఈ క్రమంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(68).. అమన్ జ్యోత్ కౌర్(21)తో కలిసి జట్టును ముందుకు నడిపించింది.
ఇద్దరూ శ్రీలంక బౌలర్లను ధీటుగా ఎదుర్కొని స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.వీరిద్దరూ ఔటైన తర్వాత చివర్లో అరుంధతి రెడ్డి ధనాధన్ బ్యాటింగ్ తో చెలరేగింది. కేవలం 11 బంతుల్లోనే 27 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. అరుంధతి.. చివరి ఓవర్లలో మూడు ఫోర్లు, ఒక సిక్స్ బాదింది. దీంతో ఫైనల్ ఓవర్ లో 20 పరుగులు వచ్చాయి.దీంతో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో ఆటపట్టు, రష్మిక, కవిషాలు రెండేసి వికెట్లు పడగొట్టగా.. నిమాషాక ఒక వికెట్ తీసింది.