టీమిండియా టి20 జట్టులో తిరిగి చోటు సంపాదించే సత్తా శుభ్‌మన్ గిల్‌కు ఉందని మాజీ స్టార్ ఆటగాడు హర్భజన్ సింగ్ జోస్యం చెప్పాడు. వరల్డ్‌కప్ టీమ్‌లో గిల్‌కు చోటు దక్కనంత మాత్రాన అతని టి20 కెరీర్ ముగిసిందని కొంత మంది ప్రచారం చేయడం సరికాదన్నాడు. మూడు ఫార్మాట్‌లలోనూ గిల్ కీలక ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. జట్టు సమీకరణాల వల్లే గిల్‌ను వరల్డ్‌కప్ జట్టులో ఎంపిక చేయలేదన్నాడు. రానున్న రోజుల్లో అతను మళ్లీ టి20 టీమ్‌లో స్థానం సంపాదించడం ఖాయమన్నాడు. గిల్ ఒక క్లాస్ ప్లేయర్. అతను జట్టులో తిరిగి వస్తాడన్న నమ్మకం ఉందని హర్భజన్ ధీమా వ్యక్తం చేశాడు.