గోవా నుంచి హైదరాబాద్ కు భారీగా డ్రగ్స్ తీసుకొస్తున్న యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. యువతి బంజారాహిల్స్ కు చెందిన హస్సాగా పోలీసులు గుర్తించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో డ్రగ్స్ పెడ్లర్ గా మారింది. 2024 లో గోవాకి వెళ్లిన హస్సా ఎండిఎంఎ రుచి చూసింది. ఆ తర్వాత డ్రగ్స్ కి బానిసగా మారింది. గోవాలో నైజీరియన్ డ్రగ్ గ్యాంగ్ తో సంబంధాలు ఎర్పచుకొని వారి వద్ద నుంచి తక్కువ ధరకు ఎండిఎంఎ, ఎల్ ఎస్ డి వంటి ఖరీదైన డ్రగ్స్ ను కొనుగొలు చేసి హైదరాబాద్ లో విక్రయించేది. గతంలో హస్సాపై గొల్కొండ పోలీస్ స్టేషన్ లో ఎన్ డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోవైంది. ఆ కేసులో జైలుకు వెళ్లిన హస్సా ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చింది. జైలు నుంచి బయటకు వచ్చాక మరికొందరు స్నేహితులతో కలిసి పకడ్బందీగా డ్రగ్స్ దందా చేస్తుంది.