టీం ఇండియా మహిళ యువ క్రికెటర్ షెఫాలీ వర్మ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది. శ్రీలంకతో జరుగుతున్న ఐదు టి-20ల సిరీస్‌లో నాలుగు మ్యాచుల్లో మూడు అర్థ శతకాలు సాధించింది. మంగళవారం తిరువనంతపురంలో జరిగ ఐదో టి-20లో కానీ ఇదే జోరును కొనసాగిస్తే.. ప్రపంచ రికార్డును సృష్టిస్తుంది. మరో 75 పరుగులు చేస్తే.. మహిళల అంతర్జాతీయ టి-20 సిరీస్‌లో ఎక్కవ రన్స్ చేసిన ప్లేయర్‌గా నిలువనుంది. షెషాలి ఇప్పటికే ఈ సిరీస్‌లో 236 పరుగులు చేసింది. తొలి మ్యాచ్‌లో 9 పరుగులు చేసి ఔట్ కాగా.. ఆ తర్వాతి మ్యాచుల్లో 69*, 79*, 79* పరుగులు చేసింది. ప్రస్తుతం టి-20 అంతర్జాతీయ సిరీస్‌ల్లో అత్యధిక పరుగుల రికార్డు వెస్టిండీస్ దిగ్గజం హేలీ మాథ్యూస్ (310) పేరిట ఉంది