అహ్మదాబాద్: లగర్జీ కారులో హైబ్రీడ్ మాదకద్రవాల అక్రమ రవాణా చేస్తున్న డ్రగ్స్ ముఠా గుట్టు రట్టైంది. బెంజ్ కారులో డ్రగ్స్ అక్రమ రవారణా చేస్తున్న డ్రగ్స్ రాకెట్‌ను అహ్మదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అహ్మదాబాద్ శివార్లలో కారు నుంచి రూ.15 లక్షల విలువైన హైబ్రీడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ రూ.10 వేలు చెల్లించి అతడి సాయంతో కొనుగోలుదారుల వద్దకు డ్రగ్స్ తరలిస్తున్నట్లు గుర్తించామని అన్నారు. డిసెంబర్ 31న వివిధ ఫామ్‌హౌజ్‌లలో నిర్వహించనున్న రేవ్ పార్టీల నిర్వహకులకు ఈ మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు.
అర్చిత్ అగర్వాల్ అనే డ్రగ్స్ సరఫరాదారు థాయిలాండ్ నుంచి హైబ్రీడ్ గంజాయిని తీసుకువచ్చి.. ఎవరికీ అనుమానం రాకుండా ఉండటానికి తన లగ్జరీ కార్లలో వీటిని అహ్మదాబాద్‌లోని పలు ప్రాంతాలకు తరలిస్తుంటాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేయగా.. ప్రధాన నిందితుడిు అగర్వాల్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నయని పేర్కొన్నారు.