హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ కింద బైకు పడి ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి చెందింది. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అబ్దుల్లాపూర్ మెట్ లో విద్యార్థులు ముగ్గురూ ఒకే కళాశాలకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.