టీం ఇండియా స్టార్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా టెస్ట్ క్రికెట్ ఆడి చాలా కాలమే అయింది. 2018లో చివరిసారిగా అతడు టెస్ట్ క్రికెట్ ఆడాడు. ఆ తర్వాత మళ్లీ రెడ్ బాల్ గేమ్‌లో పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో టీం ఇండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప.. హా్ర్థిక్ టెస్ట్ క్రికెట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్ట్ క్రికెట్ జట్టులోకి పునరాగమనం చేసే సత్తా హార్థిక్‌కి ఉందని ఉతప్ప అభిప్రాయపడ్డాడు. అలా జరిగితే హార్థిక్ 7వ స్థానం సరిగ్గా సరిపోతుందని అన్నాడు.
‘‘ఒకవేళ హార్థిక్ టెస్ట్ క్రికెట్‌లో పునరాగమనం చేస్తే.. నం.7వ స్థానం అతడికి సరిగ్గా సరిపోతుంది. ప్రస్తుతం అతడు ఆడే విధానం చూస్తే.. ఏదైనా జరగవచ్చు అని అనిపిస్తోంది. ఎందుకంటే ఇది క్రికెట్. హార్థిక పాండ్యా టెస్ట్ క్రికెట్ ఆడాలని నిర్ణయం తీసుకుంటే బిసిసిఐ అడ్డు చెబుతుందా? హార్థిక్ తాను ఆడి.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ గెలిపిస్తా అంటే బిసిసిఐ వద్ద అంటుందని నాకు అనిపించడం లేదు’’ అని ఉతప్ప తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు.