డీమెరిట్ పాయింట్ కేటాయింపు
దుబాయ్: మేల్‌బోర్న్ పిచ్‌పై ఐసిసి ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు రోజుల్లో 36 వికెట్లు పడడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. పూర్తిగా బౌలింగ్‌కు అనుకూలించిన ఈ విక్పెరెండు రోజుల్లోనే 36 వికెట్లు పడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో ఆతిథ్య ఆస్ట్రేలియాను ఓడించింది. ఏకపక్షంగా పేస్ బౌలర్లకు అనుకూలించిన ఈ పిచ్‌పై చర్యలకు ఐసిసి ఉపక్రమించింది. ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించడంతో పాటు అసంతృప్తికరంగా ఉందనే రేటింగ్ ఇచ్చింది. ‘మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ పిచ్ బౌలర్లకే అనుకూలంగా ఉంది. తొలి రోజు 20 వికెట్లు, రెండోరోజు 16 వికెట్లు పడ్డాయి. ఒక్క బ్యాటర్ కూడా కనీసం హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు.
ఈ పిచ్ మరి దారుణంగా ఉంది’ అని పేర్కొంది. ఐసిసి పిచ్ రేటింగ్‌లో వెరీగుడ్, సంతృప్తికరం, అసంతృకరం, అన్‌ఫిట్ అనే నాలుగు కేటగిరీలు ఉంటాయి. పిచ్ నాణ్యత సరిగ్గా లేకుంటే ఐసిసి డీమెరిట్ పాయింట్స్ కేటాయిస్తుంది. అసంతృప్తికరం అనే రేటింగ్‌కు ఒక డీమెరిట్ పాయింట్, అన్‌ఫిట్‌కు 3 డీమెరిట్ పాయింట్స్ కేటాయిస్తారు. ఈ పాయింట్స్ ఐదేళ్ల పాటు మైదానం ఖాతాలో ఉంటాయి. ఒక వేదికకు 5 డీమెరిట్ పాయింట్లు వస్తే, ఆ స్టేడియాన్ని ఏడాదిపాటు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించకుండా నిషేధం విధిస్తారు. రేటింగ్ ఇవ్వడానికి బౌన్స్, సీమ్ మూవ్మెంట్, టర్న్, అవుట్‌ఫపీల్డ్ ఎలా ఉందనే విషయాలను పరిగణలోకి తీసుకుంటారు. ముఖ్యంగా ఆటగాళ్ల భద్రతకు ఉంచుకొని పరిశీలిస్తారు. అయితే మేల్‌బోర్న్ వేదికగా జరిగిన గత మూడు బాక్సింగ్ డే టెస్టులకు వెరీగుడ్ రేటింగ్ ఇచ్చిన ఐసిసి ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా జరిగిన నాలుగో టెస్టుకు అసంతృప్తికరమని రేటింగ్ ఇచ్చింది. కాగా, ఈ టెస్టులో ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ చేసిన 46 పరుగులే ఈ మ్యాచ్‌లో అత్యధిక స్కోర్.