మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కో ర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టిజి ఎప్‌సెట్ 2026 కన్వీనర్‌గా కె.విజయ కుమార్ రెడ్డి నియమితులయ్యారు. జెఎన్‌టియుహెచ్ రెక్టార్‌గా విధులు నిర్వహిస్తున్న విజయకుమార్‌రెడ్డిని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఎప్‌సెట్ కన్వీనర్‌గా నియమించింది. అలాగే టిజి పిజిఇసెట్ కన్వీనర్‌గా కె.వెంకటేశ్వరరావు, టిజి ఐసెట్ కన్వీనర్‌గా అలువాల రవి, ఇసెట్ కన్వీనర్‌గా పి.చంద్రశేఖర్, లాసెట్, పిజిఎల్‌సెట్ కన్వీనర్‌గా బి.విజయలక్ష్మి, ఎడ్‌సెట్ కన్వీనర్ గా బి.వెంకట్రాంరెడ్డి, పిఇసెట్ కన్వీనర్‌గా రాజేష్‌కుమార్ నియమితులయ్యారు. రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్షలు నిర్వహించే యూనివర్సిటీలను ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. టిజి ఎప్‌సెట్, పిజిఇసెట్ నిర్వహణ బాధ్యతలను మళ్లీ జెఎన్‌టియుహెచ్‌కే అప్పగించింది. అలాగే ఐసెట్ నిర్వహణ బాధ్యతలు మహాత్మాగాంధీ యూనివర్సిటీకి అప్పగించగా, ఇసెట్, లాసెట్ నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా యూనివర్సిటీకి, ఎడ్‌సెట్ నిర్వహణను కాకతీయ వర్సిటీకి, పిఇసెట్ బాధ్యతలు శాతవాహన యూనివర్సిటీకి అప్పగిస్తూ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది.
ప్రవేశ పరీక్షలు నిర్వహించే వర్సిటీలు, కన్వీనర్ల వివరాలు
టిజి ఎప్‌సెట్ కన్వీనర్ కె.విజయకుమార్‌రెడ్డి (జెఎన్‌టియుహెచ్)
టిజి పిజి ఇసెట్ కన్వీనర్ కె.వెంకటేశ్వరరావు (జెఎన్‌టియుహెచ్)
టిజి ఐసెట్ కన్వీనర్ అలువాల రవి (మహాత్మాగాంధీ యూనివర్సిటీ)
టిజి ఇసెట్ కన్వీనర్ పి.చంద్రశేఖర్ (ఉస్మానియా యూనివర్సిటీ)
టిజి లాసెట్, టిజి పిజిఎల్‌సెట్ కన్వీనర్ బి. విజయలక్ష్మి (ఉస్మానియా యూనివర్సిటీ)
టిజి ఎడ్‌సెట్ కన్వీనర్ బి.వెంకట్రాంరెడ్డి (కాకతీయ యూనివర్సిటీ)
టిజి పిఇసెట్ కన్వీనర్ రాజేష్‌కుమార్ (శాతవాహన యూనివర్సిటీ)