దుబాయ్: న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డౌగ్ బ్రేస్బేవెల్ అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికాడు. 18 ఏళ్లుగా కివీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈ ఆల్‌రౌండర్ సోమవారం రిటెర్మెంట్ ప్రకటించాడు. ఆల్‌రౌండర్‌గా న్యూజిలాండ్ విజయాల్లో కీలకమైన అతడు పక్కటెముకల గాయంతో సతమతమవుతున్నాడు. ఈ గాయంతోనే ఈ ఏడాది దేశవాళీ సీజన్‌కూ ఆడలేకపోయాడు. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ‘నా జీవితంలో క్రికెట్‌గా ఎదగాలనుకున్న నా కల సాకరమైంది. నాకు అవకాశం ఇచ్చిన న్యూజిలాండ్ బోర్డుకు కృతజతలు. నా దేశం తరఫున ఆడడం, దేశవాళీలో సెంట్రల్ట్రకు ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయం.
ఈ సందర్భంగా నాతో కలిసిఆడిన సహచరులకు, కోచ్‌లు, మేనేజ్మెంట్కు ధన్యవాదాలు. సుదీర్ఘకాలం క్రికెట్ కెరీర్ సాగినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని అని డౌగ్ పేర్కొన్నాడు. 2008లో ఆస్ట్రేలియాపై 6/40తో ఫస్ట్ క్రాస్‌లో అరంగేట్రం చేసిన డౌగ్ ఆ తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 2011లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన బ్రేస్బేవెల్ టెస్టులు, వన్డేలు, టి20ల్లో కివీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. తన మూడో టెస్టులోనే ఆసీస్‌పై అత్యుత్తమ ప్రదర్శన చేసి (6/40)తో జట్టును గెలిపిండు స్టార్ పేసర్.