మహిళా డ్రైవర్ల కోసం జనవరి 3వ తేదీన హైదరాబాద్‌లో ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నట్లు మహిళా భద్రతా విభాగం డిజి చారుసిన్హా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మహిళలకు గౌరప్రదమయిన, స్థిరమయిన ఉపాధి అవకాశాలే లక్షంగా ఈ జాబ్ మేళా నిర్వహించనున్నామన్నారు. మహిళా కేంద్రీకృత రవాణా సేవలను బలోపేతం చేస్తూ, మహిళల ఆర్థిక స్వాతంత్య్రాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా భరోసా – సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్, చిల్డ్రన్, ఉమెన్ సేఫ్టీ వింగ్, హైదరాబాద్ సిటీ పోలీసులు సంయుక్తంగా ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. జనవరి 3వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లోని పిటిసిలో జరుగుతుందని, ఈ జాబ్ మేళాకు 21 నుంచి -45 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు అర్హులని తెలిపారు. ఆసక్తి గల వారు 8978862299 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.