చైనా మాంజా గొంతుకు బిగుసుకుపోవడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన పాతబస్తీలో సోమవారం చోటుచేసుకుంది. పాతబస్తీ, నవాబ్ సాహెబ్ కుంటకు చెందిన జమీల్ అనే యువకుడు బైక్‌పై చార్మినార్ వైపు వెళ్తండగా చైనా మాంజా మెడకు చుట్టుకుంది. దీంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు, వెంటనే ఆస్పత్రికి తరలించగా వైద్యులు యువకుడి మెడకు 22 కుట్లు వేశారు. యువకుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చైనా మాంజా వల్ల పక్షులు, మనుషులకు తీవ్ర ముప్పు ఉందని వాటిని విక్రయిస్తున్న వారిని పట్టిచ్చిన వారికి రూ. 5,000 బహుమానంగా ఇస్తానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో మాంజాను విక్రయిస్తే ఉపేక్షించమని హెచ్చరించారు. చైనా మాంజా విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేయిస్తామని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని తెలిపారు.