నయ వంచక నయా డిజిటల్ స్కామ్‌లు జోరందుకుంటున్నాయి. ముంబైకి చెందిన 68 సంవత్సరాల వృద్ధ మహిళ డిజిటల్ అరెస్టుకు గురైన క్రమంలో ఏకంగా తన ఖాతాలో నుంచి రూ 3.71 కోట్లు పోగొట్టుకుంది. పక్కన ఉన్న గుజరాత్ రాష్ట్ర వ్యక్తి తనను తాను ఆఫీసరు ఎస్‌కె జైస్వాల్‌ను అని చెప్పి ఈ మహిళను బెదిరించి డబ్బు కొట్టేశాడు. రూ 6 కోట్ల మేర అక్రమ ఆర్థిక లావాదేవీలతో కూడిన ఖాతాలు ఉన్నామని ఆమెకు చెప్పారు. ఈ క్రమంలో జస్టిస్ చంద్రచూడ్‌ను అంటూ వీడియో కాన్ఫరెన్స్‌లో ముందుకు పెట్టి మోసానికి పాల్పడ్డాడు నేరానికి పాల్పడ్డ ఈ వ్యక్తిని త్వరితగతి దర్యాప్తు క్రమంలో అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు సోమవారం తెలిపారు. సైబర్ నేరస్తులు తెలివిమీరి పోయారు. ఏకంగా వీరు తాము ముంబై కొలాబా పోలీసు స్టేషన్‌కు చెందిన వారిమని, అంతేకాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులమని చెప్పి ఈ మహిళను ఫోన్ ద్వారా డిజిటల్ అరెస్టు చేసి, ఆమె బ్యాంకు ఖాతాలను రాబట్టుకున్నారని వెల్లడైంది. పైగా ఈ సైబర్ క్రైమ్ గ్యాంగ్ నకిలీ ఆన్‌లైన్ కోర్టు ఏర్పాటు, ఇందులో విచారణ వంటి పెద్ద డ్రామాకు తెరతీశారు. ఈ మాయాజాలానికి గురై మహిళ తన సొమ్మును పోగొట్టుకుంది. ఈ ఉదంతంలో ఈ నేరస్తుడు తనను తాను జస్టిస్ చంద్రచూడ్‌ను మాట్లాడుతున్నానని, కేసు విచారణ జరుపుతున్నామని బెదిరించి ఆమె పూర్తి సమాచారం లాగేసినట్లు వెల్లడైంది. బాధితురాలు అంధేరి వెస్ట్‌లో ఉంటోంది.
ఈమెపై తమ నిఘావేసి, ఆన్‌లైన్ కార్యకలాపాలను పసికడుతూ వచ్చిన నేరస్తులు ఓ మనీ లాండరింగ్ కేసులో విచారణ జరుపుతున్నామని తెలిపి, జస్టిస్ చంద్రచూడ్‌ను అని చెప్పి ఉన్నదంతా ఊడ్చేశారు. ఈ నేరం వరుసగా పలు దశల్లో ఆగస్టు 18 నుంచి అక్టోబర్ 13 మధ్యలో జరిగిందని గుర్తించారు. మనీలాండరింగ్ కేసు ఉందమ్మా? దీనిని సిబిఐకి పంపిస్తున్నాం. అక్కడికి వెళ్లితే ఏం చేయలేం.విషయం ఎవరికి చెప్పొద్దు. ’ అంటూ తొలుత జైస్వాల్ పేరిట ఓ మోసగాడు ముందుకు వచ్చాడు. వృద్ధురాలి జీవిత చరిత్ర పేరిట మూడు పేజీల వ్యాసం కూడా పంపించాడు. తరువాత కొద్దిరోజులకు ఇక జస్టిస్ చంద్రచూడ్ ముందు వీడియో ద్వారా విచారణ జరుగుతుందని చెప్పారు. ఆమె వీడియో కాల్‌లోకి రప్పించారు. అక్కడ జస్టిస్ చంద్రచూడ్ పేరిట ఓ వ్యక్తి కేసు విచారణ న్యాయమూర్తిగా ముందుకు వచ్చాడు. ఇక వివరాలు చెప్పండమ్మా అంటూ పెట్టుబడులు, బ్యాంకు ఖాతాల నెంబర్లు, పాలసీల వివరాలను రాబట్టుకున్నారు. ఈ క్రమంలోనే రెండు నెలల కాలంలో ఆమెకు చెందిన పలు బ్యాంకు ఖాతాల నుంచి దాదాపు 4 కోట్లు గుర్తు తెలియని వ్యక్తి కొల్లగొట్టాడు. ఖాతాల తరువాతి వివరాలు తెలుసుకుని ఈ మహిళ తన పరిస్థితిని పోలీసులకు తెలియచేయడంతో డిజిటల్ అరెస్టు ఘటన జరిగినట్లు నిర్థారణ అయింది.