సిఎం రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం తిరుమలకు బయలుదేరి వెళ్లారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కుటుంబంతో సహా తిరుమలకు వెళ్లి, అక్కడ ఆయన ప్రత్యేక పూజలు చేయనున్నారు. తిరిగి నేడు (మంగళవారం) సాయంత్రంలోగా ఆయన హైదరాబాద్‌కు చేరుకుంటారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ఉత్తరద్వారం ద్వారా ఈ అర్థరాత్రి నుంచి టిటిడి శ్రీవారి దర్శనం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే భక్తులు లక్షల సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండటంతో టిటిడి పటిష్టమైన చర్యలు చేపట్టింది.