ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ ట్రక్కు అదుపు తప్పి పక్కనే ఉన్న బొలెరో వాహనంపై బోల్తా పడింది. ఈ ఘటనలో బొలెరో వాహనం నుజ్జునుజ్జు అయింది. అందులో ఉన్న డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని జెసిబి సాయంతో ట్రక్కును పక్కకు తొలగించారు. వాహనం నుంచి డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టంకి పంపించారు.