మనతెలంగాణ, సిటిబ్యూరోః గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని నాంపల్లిలోని ద్వారక మంగూర్ బస్తీలో సోమవారం అరెస్టు చేశారు. మరో ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడి వద్ద నుంచి 1.2కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మంగూర్‌బస్తీలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారం రావడంతో ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే దీరేష్ అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తుండగా ఎక్సైజ్ సిబ్బంది పట్టుకున్నారు. గంజాయి విక్రయాలతో సంబంధం ఉన్న కాలు అలియాస్ సాయి, ఆశూ అనే వ్యక్తులు పరారీలో ఉన్నారు. కేసు దర్యాప్తు కోసం నిందితుడిని నాంపల్లి ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.
ఎన్‌డిపిఎల్ మద్యం స్వాధీనం
ఢిల్లీ, గోవా నుంచి విమానాల్లో తీసుకుని వచ్చి ఇక్కడ విక్రయిస్తున్న ఎన్‌డిపి 87 మద్యం బాటిళ్లను ఎక్సైజ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న ఎక్సైజ్ సిబ్బంది శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి వచ్చిన కార్లను తనిఖీ చేయగా 87మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో ఎస్‌టిఎఫ్ ఎ, సి, డి టీములు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎక్సైజ్ సిబ్బంది పట్టుకున్నారు.