రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ కామెడీ చిత్రం ‘ది రాజాసాబ్’. ఇటీవలే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. అయితే సినిమా విడుదల దగ్గర పడుతున్న వేళ చిత్ర యూనిట్ ఫ్యాన్స్‌కి చిత్ర యూనిట్ మరో సర్‌ప్రైజ్ ఇఛ్చింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఓ ట్రైలర్ వచ్చింది. కామెడీతో పాటు హారర్ ఎలిమెంట్స్‌తో ట్రైలర్ ఆకట్టుకుంది. తాజాగా ‘ది రాజాసాబ్’ ట్రైలర్ 2.0ని విడుదల చేశారు. మొదటి ట్రైలర్ కంటే ఈ ట్రైలర్‌లో గ్రాఫిక్స్, విజువల్స్ అదిరిపోయాయి. ఈ ట్రైలర్ చూస్తే.. సినిమా ఏ రుంజ్ ఉంటుందో అర్థమవుతోందని అని ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ధి కుమార్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. 2026, జనవరి 9వ తేదీన సినిమా విడుదల కానుంది.