రామ్‌చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాపై చరణ్ అభిమానులు తారాస్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్‌డేట్స్ అన్ని ఆకట్టుకున్నాయి. తాజాగా మరో అప్‌డేట్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రంలో స్టార్ నటుడు జగపతి బాబు ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. జగపతి బాబు అప్పలసూరి అనే పాత్రలో ఈ చిత్రంలో కనిపించనున్నారు.
ఒకప్పుడు హీరోగా ప్రేక్షకులను అలరించిన జగపతి బాబు.. గత కొన్ని సంవత్సరాలుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్నారు. దాదాపు అన్ని చిత్రాల్లో ఆయన దాదాపుగా ఒకే లుక్‌లో కనిపించారు. కానీ, పెద్దిలో మాత్రం డిఫరెంట్ లుక్‌లో, గుర్తుపట్టలేనంతాగా మారిపోయారు. మరి ఈ సినిమాలో ఆయనది పాజిటివ్ రోలా.? లేక నెగటివ్ రోలా.? అనే విషయంలో క్లారిటీ లేదు.
ఇక పెద్ది చిత్రం విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఎఆర్ రహమాన్ సంగీతం సమకూర్చుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇటీవలే ఈ సినిమా ఢిలీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా విడుదల కానుంది.