రాజ్‌కోట్: టీం ఇండియా వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ ధృవ్ జురేల్ సెలక్టర్లకు సవాల్ విసిరాడు. విజయ్ హజారే ట్రోఫీలో అద్భుత శతకంతో చెలరేగిపోయాడు. ఈ టోర్నమెంట్‌లో ఉత్తర్‌ప్రదేశ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ధృవ్.. అద్భుతమైన ఫామ్‌తో బ్యాటింగ్ చేశాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన ధృవ్.. టి-20 తరహాలో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్న తను మాత్రం పట్టు వదలకుండా ఆడాడు. 78 బంతుల్లో సెంచరీ మార్క్‌ను చేరుకున్న అతడు.. ఓవరాల్‌గా 101 బంతుల్లో..15 ఫోర్లు, 8 సిక్సుల సాయంతో 160 పరుగులు చేశాడు. దీంతో న్యూజిలాండ్‌య పర్యటనకు జట్టును ఎంపిక చేసే క్రమంలో ధృవ్ సెలక్టర్లకు తన ప్రతిభను చూపించి.. అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడని అనిపిస్తోంది.