హైదరాబాద్: బిఆర్ఎస్ ఉనికిని కాపాడుకునే పనిలో ఉందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నీటి వాటాల విషయంలో మంత్రులు అందరూ అలర్ట్ గా ఉండాలని అన్నారు. మంత్రుల సమావేశంలో సిఎం మాట్లాడుతూ.. ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చేందుకు మంత్రులు సిద్ధం కావాలని ఆదేశించారు. జిల్లాల వారీగా మంత్రులు ఎదురుదాడికి సిద్ధం కావాలని, సభలో పాయింట్ అఫ్ ఆర్డర్ ముఖ్యమని తెలియజేశారు. ప్రతిపక్షం అడిగే ప్రతీ అంశానికి సమాధానం ఇవ్వాలని సూచించారు. జనవరి 4 వరకు సభ జరిగే అవకాశం ఉంటుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.