హైదరాబాద్: సినీ నటుడు అల్లు శిరీష్‌కు అతడి ప్రేయసి నయనికతో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. త్వరలో వీరిద్దరు వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. తాజాగా శిరీష్ తన పెళ్లి డేట్‌ని వెల్లడించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న ఓ పాటతో శిరీష్ రీల్‌తో తన పెళ్లి తేదీని ప్రకటించారు. ఈ రీల్‌లో అల్లు అర్జున్ పిల్లలు అయాన్, అర్హ కూడా ఉన్నారు. వాళ్లు ‘బాబాయ్.. పెళ్లి తేద ఎప్పుడూ’ అని అడగగా.. శిరీష్ ‘2026, మార్చి 6’ అని శిరీష్ చెబుతాడు. ఆ తర్వాత ‘సంగీత్ ఎప్పుడు’ అని అడగ్గా.. ‘మనం దక్షిణాది వాళ్లం.. అలాంటివి చేసుకోం’ అని శిరీష్ అంటాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. శిరీష్‌కి ఈ సందర్భంగా అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారెు. మరోవైపు అల్లు అర్జున్ వివాహం కూడా మార్చి 6, 2011నే కావడం మరో విశేషం.