హైదరాబాద్: శాసన సభ, మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. సూర్యాపేట మాజీ ఎంఎల్‌ఎ రాంరెడ్డి దామోదర్ రెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ కొండా లక్ష్మణ్ రెడ్డి మృతిపట్ల శాసన సభ సంతాపం తెలిపింది. శాసన సభకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను సభ్యులు పలకరించారు. కెసిఆర్ వద్దకు వెళ్లి సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబులు అభివాదం చేశారు. కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిపై సిఎం రేవంత్ రెడ్డి వాకబు చేశారు. అనంతరం కెసిఆర్ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. తన నివాసం నందినగర్‌కు కెసిఆర్ వెళ్లిపోయారు. సభ ప్రారంభం అయిన తర్వాత 3 నిమిషాలు మాత్రమే కెసిఆర్ శాసస సభలో ఉన్నారు.