తల్లాడ: ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అంజనాపురం గ్రామ శివారులో లారీ, కారు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. కారులో ఐదుగురు విశాఖపట్నం నుంచి ఖమ్మం వైపు వెళ్తుండగా, లారీ తల్లాడ నుంచి సత్తుపల్లి వైపు వెళ్తోంది. ఎదురెదురుగా రెండు వాహనాలు ఢీకొనడంతో బాలకృష్ణ(30), అనిల్(31) ఘటనా స్థలంలో చనిపోయారు. మరో ముగ్గురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.