అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడులో సిఐ వేధిస్తున్నాడని ఆరోపిస్తూ మహిళ ఆత్మహత్యయత్నం చేసుకుంది. పల్నాడుకు చెందిన ధాన్యం వ్యాపారి భార్య కోడూరి జ్యోతిని బెదిరించి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి సెల్లో వేసే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తరచూ సిఐ వేధిస్తున్నాడని సదరు మహిళ కత్తితో పోలీస్ స్టేషన్ లోనే చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. బలవంతంగా పోలీస్ స్టేషన్ కు ఎందుకు తీసుకువస్తున్నారని ప్రాణం కన్నా పరువు ముఖ్యం అని కత్తితో మహిళ చెయ్యి కోసుకుంది. గాయపడిన మహిళను పోలీసులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తమపై ఏ కేసు లేకుండా పోలీస్ స్టేషన్ కు ఎందుకు తీసుకువస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మహిళలను రాత్రి 7:30 గంటల తరువాత పోలీస్ స్టేషన్ కు తీసుకురాకూడదని సీఐకి తెలియదా? అని ప్రశ్నించింది.