అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లాలో ఎలమంచిలి వద్ద రైలులో మంటలు చెలరేగాయి. టాటా-ఎర్నాకుళం (18189) అనే రైలు అర్థరాత్రి సమయంలో మంటల చెలరేగడంతో లోకో పైలట్లు గురించి రైలును నిలిపేశారు. బి1 బోగీల్లో ఒకరు సజీవదహనమయ్యారు. మృతుడు విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్(70)గా గుర్తించారు. అప్పటికే బి1, ఎం2 ఎసి బోగీల్లో మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని రైలు నుంచి దూకారు. దట్టమైన పొగ వ్యాపించడంతో రైలులో ఏం జరుగుతుందో తెలియలేదు. బి1 ఎసి బోగీ బ్రేకులు పట్టేయడంతో అగ్నిప్రమాదం జరిగినట్టు సమాచారం. బోగీల్లోని ప్రయాణికులను సామర్ల కోట స్టేషన్‌కు మూడు ఆర్‌టిసి బస్సుల్లో ప్రయాణికులను తరలించారు. ఆ రైలుకు రెండు ఎసి బోగీలను జత చేసి ఎర్నాకులానికి తరలించనున్నారు. దీంతో విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లే రైళ్ల ఆలస్యంగా నడుస్తున్నాయి.