రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ ‘రాజా సాబ్’. ఈ చిత్రాన్ని హారర్ కామెడీ జానర్‌లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. ‘రాజా సాబ్’ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న ‘రాజా సాబ్’ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.
హైదరాబాద్‌లో జరిగిన ‘రాజా సాబ్‘ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ ‘రాజా సాబ్ వెనక బలంగా నిలబడింది ఇద్దరు. ఒకరు ప్రభాస్, మరొకరు విశ్వప్రసాద్. రాజా సాబ్ కథ విని ప్రభాస్ చాలా నవ్వుకున్నారు. అయితే ఆయనకు ఈ సినిమా చేయాల్సిన అవసరం లేదు. బాహుబలి తర్వాత ప్రపంచమంతా ప్రభాస్ గుర్తింపు తెచ్చుకున్నారు. మేము సౌతాఫ్రికాలో ఒక చిన్న ఊరిలో షూటింగ్ చేస్తుంటే, అక్కడి వారికి కూడా ప్రభాస్ తెలియడం మమ్మల్ని సర్ ప్రైజ్ చేసింది. సంక్రాంతికి చాలా మూవీస్ వస్తున్నా విశ్వప్రసాద్ చాలా ధైర్యంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు ‘అని పేర్కొన్నారు.
ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ ‘మా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో బిగ్గెస్ట్ స్టార్‌తో చేసిన బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇది. గ్లోబల్‌గా హారర్ ఫాం టసీ జానర్‌లో రాజా సాబ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ అవుతుంది’ అని తెలియజేశారు. రెబల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ ‘ఇది నాన మ్మ, మనవడి కథ. జరీనా వాహబ్ నాకు నానమ్మ క్యారెక్టర్‌లో నటించారు. డబ్బిం గ్ చెబుతుంటే నా సీన్స్ మర్చిపోయి నానమ్మ సీన్స్ చూస్తూ ఉండిపోయా. ఆమె నటనకు ఫ్యాన్‌ను అయ్యాను. నా తో పాటు జరీనా కూడా రాజా సాబ్‌లో హీరోనే. రిద్ధి, మాళవిక, నిధి ముగ్గురూ బ్యూటిఫుల్ హీరోయిన్స్. ఈ ముగ్గురు తమ పర్‌ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంటారు. రాజా సాబ్‌కు హీరో విశ్వప్రసాద్. ఈ రేంజ్ హారర్ ఫాంటసీ సినిమాకు తమన్ మాత్రమే మ్యూజిక్ చేయగలడు అనిపించింది. ఈ మూవీ క్లైమాక్స్‌కు వచ్చేసరికి మారుతి రైటింగ్‌కు నేను ఫ్యాన్ అయ్యాను. ఆయన పెన్‌తో రాశారా మెషీన్ గన్‌తో రాశారా అనే డౌట్ వచ్చింది. హారర్ కామెడీలోనే కాదు ఇలాంటి క్లైమాక్స్ రాలేదు’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్లు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్, జరీనా వాహెబ్,, ఎస్ కె ఎన్ తదితరులు పాల్గొన్నారు.