తిరువనంతపురం: ఐదు టి-20ల సిరీస్‌లో భాగంగా గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో భారత మహిళల జట్టుతో జరుగుతున్న నాలుగో టి-20 మ్యాచ్‌లో శ్రీలంక మహిళల జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ వరుసగా మూడు మ్యాచుల్లో విజయం సాధించిన భారత జట్టు 3-0 తేడాతో సిరీస్‌ని కైవసం చేసుకుంది. మిగిత రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించి సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేయాలని హర్మన్‌ప్రీత్ సేన భావిస్తోంది. మరోవైపు చివరి రెండు మ్యాచుల్లో అయినా విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని శ్రీలంక అనుకుటోంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టులో రెండు మార్పులు చేయగా.. భారత్ జట్టులో కూడా రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. శ్రీలంకలో కావ్య, రష్మిక జట్టులోకి వచ్చారు. భారత్‌లో హర్లీన్, అరుంధతికి జట్టులో చోటు దక్కింది.