ప్రభాస్ హీరోగా.. మారుతి దర్శకత్వంలో త్వరలో రాబోతున్న చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ధి కుమార్‌లు హీరోయిన్లుగా నటించారు. శనివారం రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈవెంట్ జరుగుతుండగా.. ఓ అభిమాని పట్టుకున్న ప్లకార్ అదరి దృష్టిని ఆకర్షించింది. అందులో ‘నిధిపాపను పెళ్లి చేసుకోవాలంటే ఏ వృత్తిలో ఉండాలి? ఎంత ఆస్తి? ఎలా ఉండాలి?’ అని రాసి ప్రదర్శించాడు, ఇది చూసి అంతా నవ్వుకున్నారు. ఇదే విషయాన్ని యాంకర్ సుమ నిధి దగ్గర ప్రస్తావించగా.. ‘ప్రొఫెషన్ ఆఫ్ లవ్’లో ఉండాలంటూ జవాబు ఇచ్చింది. వేదికపై నిధి మాట్లాడిన తర్వాత ‘చీరలోనే అన్ని నిధులు ఉన్నాయి’ అంటూ సుమ అనడంతో ఈవెంట్ విజిల్స్‌తో మారు మోగిపోయింది.