టీం ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ టెస్టుల నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ప్రతిష్టాత్మక సిరీస్‌కి ముందు కోహ్లీ టెస్ట్ ఫార్మాట్‌కి గుడ్‌బై చెప్పేశాడు. దీంతో ఆయన అభిమానులు అంతా నిరాశ చెందారు. ప్రస్తుతం కోహ్లీ కేవలం వన్డే ఫార్మాట్‌లో కొనసాగుతున్నాడు. మళ్లీ కోహ్లీ టెస్ట్ క్రికెట్ ఆడితే బాగుంటుందని చాలా మంది కోరుకుంటున్నారు. అలాంటి వాళ్లలో టీం ఇండియా మాజీ ఆటగాడు నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ ఒకరు.
కోహ్లీ మళ్లీ టెస్ట్ క్రికెట్ ఆడాలని సిద్ధూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘‘దేవుడు నాకు వరం ప్రసాదించి ఏదైనా కోరుకోమంటే విరాట్ కోహ్లీ తన రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకొని టెస్ట్ క్రికెట్ ఆడేలా చేయమని ఆడుగుతాను. 1.5 బిలియన్ల జనాభా ఉన్న దేశానికి ఇంతకంటే ఆనందాన్ని, పారవశ్యాన్ని ఏదీ ఇవ్వదు. 20 ఏళ్ల యువకుడిలా విరాట్ ఫిట్‌నెస్ ఉంది. అతను 24 క్యారెట్ల బంగారం’’ అని సిద్ధూ పోస్ట్ పెట్టారు. దీనికి నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.. కోహ్లీ మళ్లీ టెస్ట్ క్రికెట్ ఆడాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.