టి-20 ప్రపంచకప్‌నకు ముందు పాకిస్థాన్, శ్రీలంకతో మూడు టి-20ల సిరీస్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లు జనవరి 7 నుంచి ప్రారంభం అవుతాయి. ఈ సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టుకు పాకిస్థాన్ క్రికెట్ సీనియర్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్ ఆడుతున్న బాబర్ అజామ్, షాహీన్ అఫ్రిది, హారిస్ రవూఫ్, మహ్మద్ రిజ్వాన్‌లను లంకతో సిరీస్‌కి ఎంపిక చేయలేదు. అన్‌క్యాప్‌డ్ వికెట్ కీపర్ ఖవాజా నఫేకు తొలిసారి జట్టులో చోటు దక్కింది.
కుడి చేతి వాటం బ్యాటర్ అయిన నఫే ఇటీవల పాకిస్థాన్ షహీన్స్ జట్టులో భాగమయ్యాడు. ఈ యువ క్రికెటర్ ఇప్పటి వరకూ ఆడిన 32 టి-20ల్లో 132.81 స్ట్రైక్‌రేటుతో 688 పరుగలు చేశాడు. నఫేతో పాటు ఆలౌరౌండర్ షాదాబ్ ఖాన్ టి-20ల జట్టులోకి వచ్చాడు. ఇక యధాథావి సల్మాన్ అఘా కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. శ్రీలంకతో టి-20 సిరీస్ ఆడే జట్టు ప్రదర్శన ఆధారంగా టి-20 ప్రపంచకప్‌నకు తుది జట్టును ఖరారు చేసుకునేందుకు ఉపయోగపడే అవకాశం ఉంది.