హైదరాబాద్: జిహెచ్ఎంసి పునర్విభజన నేపథ్యంలో మూడు పోలీస్ కమిషనరేట్లను విభజిస్తున్నారు. మూడు కమిషనరేట్ లలో 12 జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ లో 6 జోన్లు, సైబరాబాద్ లో 3 జోన్లు, రాచకొండలో 3 జోన్లు ఉండనున్నాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో శంషాబాద్, రాజేంధ్ర నగర్ జోన్లు కలవనున్నాయి. ఇకపై శంషాబాద్ విమానాశ్రయం సైతం హైదరాబాద్ కమీషనరేట్ లో కలవనుంది. హైదరాబాద్ కమీషనరేట్ పరిధిలో చార్మినార్ జోన్, గోల్కొండ జోన్, ఖైరతాబాద్ జోన్, రాజేంద్రనగర్ జోన్, సికింద్రాబాద్ జోన్, శంషాబాద్ జోన్లు ఉంటాయి. సైబరాబాద్ కమిషనరేట్ లో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో శేరిలింగంపల్లి జోన్ చేరింది. శేరిలింగంపల్లిజోన్ పరిధి మొయినాబాద్ నుంచి పటాన్ చెరు దాకా ఉంటుంది. కూకట్పల్లి జోన్, కుత్బుల్లాపూర్ జోన్లు కూడా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వస్తాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బి నగర్ జోన్, మల్కాజిగిరి జోన్, ఉప్పల్ జోన్లు ఉంటాయి. యాదాద్రి జిల్లా పోలీస్ జిల్లాగా మారనుంది. మహేశ్వరం జోన్ ,షాద్ నగర్ , చేవెళ్లను కలుపుతూ ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ గా ఏర్పాటు చేసే యోచనలో పోలీస్ శాఖ ఉంది. ఔటర్ పరిధిలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ ను మూడు కార్పొరేషన్లు జిహెచ్ఎంసి, జిఎస్ఎంసి, జిసిఎంసిగా విభజించనున్నట్టు సమాచారం.