భద్రాద్రి కొత్తగూడెం: ఆర్‌టిసి బస్సులోని ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మారేడ్ ఘాట్ రోడ్డులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… భద్రాచలంలోని మారేడ్ ఘాట్ రోడ్డులో గుడికి సమీపంలో ఆర్‌టిసి బస్సు మరో వాహనాన్ని తప్పించబోయి కల్వర్టును ఢీకొట్టింది. అనంతరం కల్వర్టు వద్ద బస్సు నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కల్వర్టు నుంచి లోయలో పడి ఉంటే పెను ప్రమాదం జరిగేదని డ్రైవర్ తెలిపాడు. గోకవరం డిపోకు చెందిన ఆర్‌టిసి బస్సు 40 మంది ప్రయాణికులతో గోకవరం నుంచి భద్రాచలానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.