హైదరాబాద్: భారత జట్టు న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆడనుంది. టీమిండియా-కివీస్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జనవరి 11 నుంచి 18 వరకు జరుగనున్నాయి. న్యూజిలాండ్ సిరీస్ సెలక్టర్లు జట్టును ప్రకటించే అవకాశం ఉంది. రిషబ్ పంత్‌ను వన్డే జట్టు నుంచి తొలగించి ఇషాన్ కిషన్ జట్టులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. గత రెండు సంవత్సరాల నుంచి కిషన్ భారత జట్టులో అవకాశాలు రావడంలేదు. 2023లో వన్డే వరల్డ్ కప్‌లో అప్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ ఆడాడు. వివిధ కారణాలతో అతడు జట్టుకు దూరమయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఎక్కువ పరుగులు చేసి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఝార్ఖండ్ జట్టకు కూడా కెప్టెన్ ఉండి ఎస్‌ఎంఎటి టైటిల్ సాధించడంలో ముందు వరసలో ఉన్నాడు. కర్నాటకతో జరిగిన మ్యాచ్‌లో 33 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. ఇప్పుడు వన్డే జట్టులో తీసుకోవడానికి మార్గం సుగమమం చేసుకున్నాడు. పంత్ మాత్ర గత కొంత కాలంగా ఫామ్‌లో లేడు. 2024లో శ్రీలంకతో చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌కు పంత్ సెలెక్ట్ చేశారు కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ప్రస్తుత పరిస్థితుల దృష్టా పంత్‌ను కివీస్ సిరీస్‌కు ఎంపిక చేయలేదు.