బాల నటుడు మాస్టర్ మహేంద్రన్ హీరోగా మారి చేస్తున్న సినిమా ‘నీలకంఠ‘. ఈ చిత్రాన్ని ఎం.మమత, ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్‌ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యా నర్స్‌పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ‘నీలకంఠ‘ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రాకేష్ మాధవన్ మాట్లాడుతూ “మా సినిమాలో మంచి ఎమోషన్స్ ఉన్నాయి. ఫైట్స్, సాంగ్స్ ఆకట్టుకుంటాయి. సినిమా చివరి 20 నిమిషాలు చూపు తిప్పుకోకుండా ఉంటుంది”అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ మహేంద్రన్, యష్న, మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి పాల్గొన్నారు.