మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: రాబోయే రోజు ల్లో ప్రజల అవసరాలు పెద్ద ఎత్తున తీరుస్తామని డి ప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జి ల్లా, పాలేరు నియోజకవర్గంలోని అనంతనగర్‌లో 33/11 కెవి సబ్ స్టేషన్‌ను శనివారం ఆయన ప్రా రంభించి, మరో సబ్ స్టేషన్‌కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడు తూ.. తమ ప్రభుత్వం అందరిదని, వనరులు, సం పద పోగు చేసి ప్రతి పైసా ప్రజలందరికీ పంచు తాం తప్ప.. దోపిడీదారులు కోసం కాదని అన్నా రు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ పథకం అందుతోందని అన్నారు. అన్ని సదుపాయాలు కల్పించి ఇది ప్రజల ప్రభుత్వం అనే నమ్మ కం కలిగించాం కాబట్టే మొన్నటి సర్పంచ్ ఎన్నిక ల్లో 65 శాతం నుంచి 70 శాతం వరకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించి రాష్ట్ర ప్రభుత్వాన్ని, తమ పార్టీని రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున ఆశీర్వదించారని తెలిపారు. ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ఒక గదిలో అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలి, మేకలను ఎక్కడ కట్టివేయాలని అవహేళన చేసిన కెసిఆర్ మాయమాటలు చెప్పి
10 సంవత్సరాలు పరిపాలించి, అదిగో ఇదిగో అని ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదని విమర్శించారు. కానీ ఇచ్చిన మాట మేరకు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఐదు లక్షలతో ఒక్కో ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్నామని అన్నారు. ప్రతి వారం ఇందిరమ్మ ఇళ్ల బిల్లులను మంజూరు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని పదేళ్లపాటు పరిపాలించిన వారు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేశారని, పాలన వ్యవస్థ ను గాడి తప్పించారని, వారు అల్లకల్లోలం చేసినా కూడా ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలు ఎటువంటి ఆటంకం లేకుండా చేపడుతున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదిప్ దురిశేట్టి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర్ రావు,డిసిసి అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పిసిసి అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి మద్దినేని బేబి స్వర్ణ కుమారి , మండల నాయకులు, స్థానిక సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.