మన తెలంగాణ/హైదరాబాద్ : కెసిఆర్ కుటుంబ సభ్యులు తమతో పాటు డ్రగ్స్ విక్రయించిన వారిలో ఉన్నారని నాడు పట్టుబడిన నిందితులు వాం గ్మూ లం ఇచ్చారని కేంద్ర హోం శాఖ సహాయ మం త్రి బండి సంజయ్ తెలిపారు. అకున్ హబర్వాల్ అధ్వర్యంలో నాటి డ్రగ్స్ కేసు విచారణ ఏమైందని శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అకున్ సబర్వాల్ విచారణ జరిపినప్పుడు అనేక మంది సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చాయని ఆయన తెలిపారు. అప్పట్లో నిందితుల ఆడియో, వీడియోలను రికార్డు చేశారని వివరించారు. అప్పుడే కెసిఆర్ కుటుంబ సభ్యులకు ప్రమేయం ఉందని ఈ విచారణలో వెల్లడైందన్నారు. ఈ ఆధారాలన్నీ ఏమయ్యాయి?, ఎందుకు విచారణ జరపడం లేదని ఆయన ప్రశ్నించారు. వెంటనే సోమేష్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు.