అక్రిడిటేషన్‌ల కోసం జారీ చేసిన కొత్త జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టులు హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. పోలీసులు ధర్నా చేస్తున్న జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడికి వెళ్లిన ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ అక్రిడిటేషన్ జర్నలిస్టుల హక్కుఅని, దానిని తీసుకోవద్దని, ఉన్నదానిని తీసుకోవద్దని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా జోక్యం చేసుకుని 252జీవోలో పదివేలు తగ్గించి ఇవ్వాలనుకోవడం చెల్లదని తెలిపారు. ఇంతకు ముందు వలే అక్రిడిటేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన జర్నలిస్టులను అరెస్టు చేయడం సరికాదని తెలిపారు. జర్నలిస్టులకు కెసిఆర్ 26వేల అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు.
రిపోర్టింగ్, డెస్క్ జర్నలిస్టులు అనే తేడా లేకుండా కార్డులు ఇచ్చారని తెలిపారు. వెంటనే జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్రిడిటేషన్ కార్డులను పదివేలకు తగ్గించడం దుర్మార్గమని అన్నారు. ధర్నా చేస్తున్న జర్నిలిస్టుల అరెస్టును ఖండించారు. జర్నలిస్టుల పోరాటానికి బిఆర్‌ఎస్ పూర్తి మద్దతు తెలుపుతుందని స్పష్టం చేశారు. ప్రజల గొంతుకు జర్నలిస్టులను అరెస్టు చేయడం, నిర్భంధించడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుషత్వానికి నిదర్శనమని మాజీ మంత్రి కెటిఆర్ విమర్శించారు. జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో మారుతి సాగర్, రమేష్ హజారి, యోగానంద్, విష్ణువర్దన్‌రెడ్డి, రమణకుమార్,కడకంచి వెంకట్ పాల్గొన్నారు.