హైదరాబాద్: తనతో కెరీర్ మొదలు పెట్టిన వారికి తనపై అసూయ, కోపం ఉందని సినీ నటుడు శివాజీ తెలిపారు. తనపై కుట్ర జరుగుతోందని అన్నారు. మహిళా కమిషన్ విచారణ అనంతరం నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఇబ్బంది పెట్టాలని కొందరు జూమ్ మీటింగ్ పెట్టుకున్నారని, తనకు బాగా కావాల్సిన వారు ఇంత కుట్ర చేస్తారని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏం తప్పు చేశానని తన మీద ఇంత కోపం? అని ప్రశ్నించారు. తాను అనవసరంగా సలహాలు ఇచ్చానని.. సలహాలు ఇవ్వడం మానుకోవాలని అర్థమైందని అన్నారు. మహిళా కమిషన్ అడిగిన వాటికి సమాధానం చెప్పానని తెలియజేశారు. విచారణ కోసం మహిళా కమిషన్ మళ్లీ పిలిచినా వస్తానని అన్నారు. తన వ్యాఖ్యల వెనుక ఎవరినీ నొప్పించాలనే ఉద్దేశం లేదని శివాజీ స్పష్టం చేశారు.