దృశ్యం సినిమా ఫ్రాంచైజీ బాగా సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన రెండు భాగాలు సూపర్ హిట్ కాగా.. ఇప్పుడు మూడో భాగం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ తాజాగా ఈ సినిమాకి ఓ సమస్య వచ్చి పడింది. రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమాతో భారీ ఫేమ్ సొంతం చేసుకున్న నటుడు అక్షయ్ ఖన్నా తాజాగా చిక్కుల్లో పడ్డారు. దృశ్యం 3 చిత్ర నిర్మాత కుమార్ మంత్ పాఠక్.. అక్షయ్‌పై దావా వేసినట్లు.. లీగల్ నోటీసులు పంపినట్లు వెల్లడించారు. దృశ్యం 3 సినిమా కోసం ఒప్పందాన్ని ఉల్లంఘించారని.. సినిమాలో భాగం కావడం లేదంటూ టెక్ట్స్ మెనేజ్ పంపించారని నిర్మాత ఆరోపించారు. తమ మధ్య ఒప్పందని జరిగిందని.. అప్పుడే కొంతమేరుకు డబ్బును అడ్వాన్స్‌గా కూడా చెల్లించామన చెప్పారు. షూటింగ్‌కు అంతరాయం కలగకుండా అక్షయ్ పాత్రలో జైదీప్ అహ్లావత్‌ను తీసుకున్నట్లు వెల్లడించారు.
‘‘రెండేళ్లుగా దృశం 3 సినిమా కోసం పని చేస్తున్నాం. అక్షయ్ ఖన్నాకు ఆ విషయం తెలుసు. స్క్రిప్ట్ మొత్తం అతనికి నచ్చింది. అన్నీ మాట్లాడుకున్న తర్వాతే సంతకాలు చేసుకున్నాం. కానీ, ఒక రోజు ఈ సినిమా చేయట్లేదని మెసేజ్ పంపారు. అతడిని సంప్రదించాలని ప్రయత్నించినా ఫలితం లేదు. తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటాం’’ అని పాఠక్ తెలిపారు.