తన లేటెస్ట్ చిత్రం ‘దండోర’ ఈవెంట్‌లో నటుడు శివాజీ ఆడవాళ్ల దుస్తుల గురించి మాట్లాడిన విషయం తీవ్ర దుమారం రేపాయి. దీనిపై నటి, యాంకర్ అనసూయ రియాక్ట్ అయింది. శివాజీకి సోషల్‌మీడియా వేదికగా పలు కౌంటర్లు వేసింది. అయితే తన వ్యాఖ్యలకు వివరణ ఇస్తూ కూడా అనసూయను మరోసారి రెచ్చగొట్టేలా మాట్లడాడు శివాజీ. దీనిపై కూడా అనసూయ రిటర్న్ కౌంటర్ ఇచ్చింది. తాజాగా అనసూయకు నటుడు ప్రకాశ్ రాజ్ మద్దతు తెలిపారు.
అనసూయకు మద్ధతు ఇస్తూ.. ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. ‘‘సంస్కారి అని పిలవబడే వారిని మొరుగుతూనే ఉండనివ్వండి అలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వారి నీచమైన మనస్తత్వం ఇలా బయటపడుతుంది. ఇలాంటి అంశంలో ఇంకా బలంగా నిలబడాలని, అందుకోసం ఎప్పుడూ కూడా అండగా ఉంటామని అనసూయను ట్యాగ్ చేస్తూ పేర్కొన్నారు. దానికి అనసూయ ధన్యవాదాలు తెలిపింది.
తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా నటుడు శివాజీపై తనదైన శైలీలో కౌంటర్ ఇచ్చారు. శివాజీని దేశాన్ని కుదిపేసిన ‘నిర్భయ’ కేసులో ఓ రేపిస్టుత ఆర్జివి పోల్చారు. రాత్రి 9గంటల తర్వాత పద్ధతిగల అమ్మాయి రోడ్ల మీద తిరగదు. ‘‘అత్యాచారా కేసుల్లో ఆడవాళ్లదే ఎక్కువ తప్పుంది. ఇందులో మగవారి తప్పు ఎక్కడుంది..?’’ అని నిర్భయ రేపిస్ట్ పేర్కొన్నాడు. శివాజీ మాట్లాడింది కూడా ఇంచుమించు ఆ కామెంట్ల వలనే ఉంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.