హైదరాబాద్: మహిళల వస్త్రధారణ విషయంలో శివాజీ చెత్తగా మాట్లాడాడని నటుడు, ప్రతినాయకుడు ప్రకాష్ రాజ్ తెలిపారు. వేదికపై మాట్లాడేటప్పుడు సంస్కారం ఉండాలని అన్నారు. శివాజీ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శివాజీ అయినా.. ఎవరైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు.. కానీ భాష భాగుండాలని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. శివాజీ మాట్లాడింది ముమ్మాటికీ తప్పేనని.. దొంగను దొంగే అనాలని.. ఐబొమ్మ రవి చేసింది తప్పేకదా అని అన్నారు. ధరలు పెంచితే సినిమాలు చూడకండని ప్రకాష్ రాజ్ విజ్ఞప్తి చేశారు.