నారాయణపేట: రోడ్డు ప్రమాదంలో గాయపడిన మాజీ ఆర్మీ ఉద్యోగి సంజీవ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ సంఘటన నారాయణపేట జిల్లా మక్తల్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సంజీవ అనే వ్యక్తి గతంలో ఆర్మీలో పని చేసేవాడు. ద్విచక్రవాహనంపై మక్తల్ నుంచి సొంతూరుకు వెళ్తుండగా అతడిని టిప్పర్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడడంతో మక్తల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మాజీ జవాన్ సంజీవ్ చనిపోయాడు. ఇటీవల జవాన్ ను రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి పరామర్శించిన విషయం తెలిసిందే. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టిప్పిర్ డ్రైవర్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.