కామారెడ్డి: వావివరసలు మరిచి చిన్నమ్మతో సహజీవనం చేస్తున్నావనే కోపంతో అన్నను తమ్ముడు గొడ్డలితో నరికి చంపాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో ఓ గ్రామంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… రాజు అనే యువకుడు తన చిన్నమ్మతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లాడు. రాజు తన చిన్నమ్మతో సహజీవనం చేస్తుండడంతో సోదరుడు శివ కుమారుడు తన అన్నపై పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయం అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. నిద్రపోతున్న రాజును శివ కుమార్ గొడ్డలితో నరికాడు. అనంతరం అతడి తలపై బండరాయి కొట్టి చంపాడు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు శివ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నామని ఎఎస్‌పి చైతన్య రెడ్డి తెలిపారు.