లక్నో: రహస్యంగా ఫోన్ ఉపయోగిస్తుందని భార్యను భర్త చంపి ఇంట్లోనే మృతదేహాన్ని పాతిపెట్టాడు. పోలీసులకు భర్త దృశ్యం సినిమా చూపించాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం గోరఖ్పూర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… లూదియానాలో అర్జున్, ఖష్బూ అనే దంపతులు నివసిస్తున్నారు. ఖుష్బూ భర్తకు తెలియకుండా రహస్యంగా మొబైల్ ఫోన్ ఉపయోగిస్తోంది. ఈ విషయంలో దంపతుల మధ్య గత కొన్ని రోజల నుంచి గొడవలు జరుగుతున్నాయి. డిసెంబర్ 21న భర్తకు తెలియకుండా ఫోన్ను భార్య దాస్తుండగా అతడు గమనించాడు. ఇద్దరు మధ్య గొడవ గొడవ తారాస్థాయికి చేరుకుంది. భార్య గొంతు నులిమి చంపి అనంతరం ఇంట్లో గోయ్యి తీసి మంచంతో సహా మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టాడు. తన భార్య కనిపించడం లేదని ఇరుగుపొరుగు వారిని అడిగాడు. ఖుష్భూ తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్లో తన కూతురు కనిపించడంలేదని ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భర్తను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. తన భార్య ఇంట్లో ఉరేసుకొని చనిపోవడంతో మృతదేహాన్ని నదిలో పడేశానని వివరణ ఇచ్చాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం కనిపించలేదు. మళ్లీ భర్తను పోలీసులు తనదైన శైలిలో ప్రశ్నించడంతో ఇంట్లోనే మృతదేహాన్ని పాతిపెట్టానని ఒప్పుకున్నాడు. ఇంట్లో పాతిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతోనే భార్యను చంపానని వివరణ ఇచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.