అమరావతి: ఓ చిన్నారి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగా మెంతో ప్లస్ బామ్ డబ్బా మింగింది. వెంటనే వైద్యులు చాకచక్యంగా మూతను బయటకు తీశారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాలో జిజిహెచ్ ఆస్పత్రిలో జరిగింది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం… అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం దామనపల్లిలో విజయదుర్గ అనే ఏడు నెలల చిన్నారికి జ్వరం రావడంతో జిజిహెచ్ ఆస్పత్రిలోని వార్డులో చికిత్స తీసుకుంటుంది. న్యూరో మెడిసిన్ విభాగంలో చికిత్స తీసుకుంటుండగా విజయదుర్గ మెంతో ప్లస్ బామ్ డబ్బా మింగింది. తల్లిదండ్రులు గమనించి వెంటనే వైద్యులకు వద్దకు తీసుకెళ్లారు. ఎన్‌ఐసియులో చికిత్స అందించారు. పాప నోటి నుంచి రక్తం కారడంతో పాప ఆపస్మారక స్థితిలో వెళ్లిందని వైద్యులు తెలిపారు. గొంతులో ఇరుక్కున్న డబ్బాను వైద్యులు చాకచక్యంగా బయటకు తీశారు. పాప ప్రాణాలతో బయటపడడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. పాపను ప్రాణాలతో కాపాడినందుకు వైద్యులు ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది. జిజిహెచ్ ఆస్పత్రి వైద్యులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కొన్ని ఆస్పత్రులలో దేవుడి రూపంలో వైద్యులు ఉన్నారని నెటిజన్లు కొనియాడుతున్నారు.